నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంట ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీల ను స్వీకరించనున్నట్టు ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కా ర వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాల ని సూచించారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్‌గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి తెప్పోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తెప్పోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి సన్నిధిలో నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భాష్కర పుష్కరిణి ప్రధాన ఘాట్ వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై ఆశీనులు చేశారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం చేపట్టి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం పూసపాటిరేగ మండలంలో కోనాడ నుంచి తీసుకువచ్చిన పడవలో స్వామిని ఉంచి పు ష్కరిణిలో తెప్పోత్సవాన్ని జరిపించారు. అర్చకుల వేద మంత్రాలతో, భక్తుల జయజయ ధ్వానాల నడుమ రామచంద్రస్వామి పుష్కరిణిలో ఊరేగారు. ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో పో లీసులు బందోబస్తు నిర్వహించారు. ఈఓ వై. శ్రీనివాసరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డి
పార్వతీపురం రూరల్: పార్వతీపురం సబ్ డివిజ న్ ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ ఏఎస్పీగా పని చేసిన అంకిత సురాన గత నెల 30న సత్యసాయి జిల్లాకు అదనపు ఎస్పీగా పదోన్నతిపై బదిలీ అయిన సంగతి విదితమే. అయితే ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా సేవలందించిన, నంద్యాలకు చెందిన మనీషా వంగలరెడ్డిని పార్వతీపురం ఏ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.


