స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పూర్తి
● ఈనెల 5 నుంచి 7 వరకు తిరుపతిలో జరగనున్న పోటీలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆదివారం పూర్తయింది. జిల్లా స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో నగర శివారులో గల విజ్జి స్టేడియం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన డివిజన్ స్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమప్రతిభ కనబరిచిన 80 మంది క్రీడాకారులు ఉమ్మడి జిల్లా నుంచి 80 మంది హాజరయ్యారు. వీరికి వ్యాయామ ఉపాధ్యాయులు పి.శ్రీరాములునాయుడు, ఆదిలక్ష్మిల నేతృత్వంలో ఎంపిక నిర్వహించగా.. అండర్–14 విభాగంలో 10 మంది బాల, బాలికలు..అండర్ 17 విభాగంలో 10 మంది బాల, బాలికలు జిల్లాస్థాయి ఎంపికల్లో అర్హత సాధించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న అంతర్ జిల్లాల స్కూల్‌గేమ్స్ పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి తెలిపారు.


