వైద్యవిద్యను ప్రైవేటు చేతుల్లోకి నెట్టొద్దు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం పేదలపై దాడి చేయడమే, పీపీపీ పేరుతో వైద్య రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి నెట్టివేస్తూ ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంటుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌కు అప్పగించడం సరికాదు. దీంతో పేద విద్యార్థులు వైద్యవిద్యకు దూరమై, రిజర్వేషన్లు పోతాయి. వైద్యం ఖరీదవుతుంది. రెడ్డి శంకరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు
మార్కెట్‌లో వైద్యవిద్య
పీపీపీ పేరిట ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం సమాజానికి పెద్ద నష్టం చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కును కల్పింస్తుంది. దానికి విద్య, వైద్యం, ఆరోగ్యం అంతర్భాగం. జీవో 590 ద్వారా 10 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడం ప్రజల హక్కుల మీద దాడి. పీపీపీ పేరుతో వైద్య విద్యను, ఆరోగ్యాన్ని అంగడి సరుకుగా మార్చే చర్యలను వెంటనే ఉపసంహరించాలి. ప్రభుత్వం నిర్మించిన వాటిని ప్రభుత్వమే నడపాలి. అప్పుడే మాత్రమే ప్రజల ఆరోగ్యం రక్షితమవుతుంది.
కె.సురేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు,
వైద్యవిద్యను ప్రైవేటు చేతుల్లోకి నెట్టొద్దు


