విద్యవైద్యపై కూటమి కాసుల కక్కుర్తి
ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత మరిచి కూటమి పాలకులు ప్రజా వైద్యవిద్య, ప్రజావైద్యంపై కాసులేరుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో కార్పొరేట్లకు అప్పగించడం ప్రజా ఆస్తులపై దోపిడీ చర్య. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజారంగంలోనే 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోగా, ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటిని కార్పొరేట్లకు కట్టబెడుతోంది. ఎకరా భూమిని రూ.99కు 66 ఏళ్ల లీజుకి ఎలా ఇస్తారు? ప్రజలు మీకు ఐదు సంవత్సరాలకే అధికారం ఇచ్చారు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మారుతుంది.
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, బుగత అశోక్


