
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ103 శ్రీ176 శ్రీ186
ఆటో బోల్తా – యువకుడికి తీవ్రగాయాలు
జామి: ఆటో బోల్తాపడి యువకుడు తీవ్ర గాయాల పాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమచారం ప్రకారం.. శాశనపల్లి గ్రామానికి చెందిన ఐ.హరి భీమసింగి గ్రోమోర్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. శనివారం ఎరువులు నిమిత్తం భీమసింగి నుంచి కొత్తవలస ఆటోలో వెళ్తున్న సమయంలో అలమండ సంత సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న హరి తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయాల పాలైన హరిని 108 వాహనంలో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అటుగా వెళ్తున్న ఎంపీపీ సబ్బవరపు అరుణ, అతని భర్త దగ్గరుండి సహయ సహకారాలు అందించారు.
‘ఆపరేషన్ ట్రేస్’తో సత్ఫలితాలు
విజయనగరం క్రైమ్ : ‘ఆపరేషను ట్రేస్‘ కార్యక్రమంలో భాగంగా అదృశ్యమైన మహిళలు, బాలబాలికల ఆచూకీని కనుగొనేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం పేర్కొన్నారు. జిల్లాలోని గజపతినగరం పోలీస్స్టేషన్ పరిధి పురిటిపెంటలో అదృశ్యమైన బాలికను గంట వ్యవధిలో కనుగొన్నామని స్పష్టం చేశారు. బాలికను ఆమె తల్లికి ఈ నెల ఒకటవ తేదీని అప్పగించామని తెలిపారు. బాలికలపై అఘాయిత్యాలను నియంత్రించేందుకు జిల్లాలో వివిధ పాఠశాలల్లో విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, తమను తాము రక్షించుకొనేందుకు అవసరమైన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌ను కూడా నేర్పిస్తున్నామన్నారు.
లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర నష్టం
నెల్లిమర్ల: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన లేబర్‌కోడ్‌లతో కార్మిక లోకానికి తీరని అన్యా యం జరుగుతుందని ఇప్టూ రాష్ట్ర కార్య దర్శి వెంకటేశ్వర్లు, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి గీత అన్నారు. నెల్లిమర్ల పట్టణంలోని అమరవీరుల స్మారక భవనంలో ఇప్టూ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. శిక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వివరించారు. కోడ్‌లు పూర్తిగా యాజమాన్యాలకు కొమ్ముకాసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ల అప్పలసూరి, ప్రధాన కార్యదర్శి గీత ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
‘పట్టాలిచ్చిన భూముల్లోనే సాగు చేసుకోవాలి’
● ఏపీఐఐసీకి ఇచ్చిన భూములు వదిలి వెళ్లిపోవాల్సిందే..
● గిరిజన రైతులకు అధికారుల హుకుం
రామభద్రపురం: గిరిజన రైతులు వారికి పట్టాలిచ్చిన భూముల్లోనే సాగు చేసుకోవాలని, ఏపీఐఐసీకి ఇచ్చిన భూములు వదిలి వెళ్లిపోవాలని సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో శనివారం డీటీ గిరిధర్, ఫారెస్టు సెక్షన్ అధికారి మహింఽద్ర, ఎస్‌ఐ వి.ప్రసాదరావు సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా కాకర్లవలస గిరిజన రైతులు భూ సమస్యలపై చేపడుతున్న ఆందోళనలపై చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఏపీఐఐసీకి విక్రయించిన భూములు సర్వే నంబర్ 717లో ఉన్నాయని, గిరిజన రైతులకు ఇచ్చిన ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు సాలూరు ఫారెస్ట్ బీట్ కంపార్ట్‌మెంట్ 179లో ఉన్నాయన్నారు. ఈ భూములు కొండ పక్కన పట్టాలు ఇస్తే ఏపీఐఐసీకి కేటాయించిన భూమిలో ఎలా సాగు చేస్తారని? ఇది డీ పట్టా భూమి అని మీరు సాగు చేస్తే కుదరదని, వదిలి వెళ్లిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఫారెస్టు సెక్షన్ అధికారి మహింద్ర మాట్లాడుతూ ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు మా అటవీ శాఖాధికారులు ఇచ్చారన్నారు. ఒకసారి ఇచ్చిన పట్టా రద్దు చేయడం కుదరదని, ఇలా రైతులు అభ్యంతరం పెట్టే హక్కు లేదన్నారు. నిబంధనల ప్రకారం భూమి ఖాళీ చేసి ఎక్కడ ఇచ్చారో ఆక్కడకు వెళ్లి సాగు చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సర్వేయర్ వి.సాయికుమార్, వీఆర్వో మహేష్‌కుమార్, గ్రామ సచివాలయ సర్వేయర్లు పాల్గొన్నారు.

చికెన్

చికెన్