
పోలీసుల అదుపులో వ్యభిచార గృహ నిర్వాహకులు
విజయనగరం క్రైమ్ : విజయనగరం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిదిలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పూల్‌బాగ్ కాలనీ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇద్దరు మహిళలు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సీఐ శ్రీనివాస్ ఆదేశాలతో స్టేషన్ మహిళా కానిస్టేబుల్ సదరు ఇంటికి వెళ్లి నిర్వాహకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఇదే విషయమై టూటౌన్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాలతో నగరంలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇందులో భాగంగానే వచ్చిన సమాచారంతో ఇద్దరు మహళలను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
గంజాయి పట్టివేత
సాలూరు: పట్టణంలో 17.3 కేజీల గంజాయి పట్టుకున్నట్టు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. పట్టణంలోని పాత బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు రోడ్డు వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు వారిని విచారించినట్టు తెలిపారు. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వీరి వద్ద ఉన్న బ్యాగులలో 17.3 కేజీల గంజాయిని గుర్తించామన్నారు. కేసు నమోదు చేశామని, నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించామని తెలిపారు.