
అర్జీలు రీ ఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలి
విజయనగరం అర్బన్: పీజీఆర్‌ఎస్ కార్యకమానికి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలని అర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమం అమలుపై ఉన్నతాధికారుల అదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్‌లు వెంకటేశ్వర రావు, ప్రమీలా గాంధీ ప్రజల నుంచి అర్జీలు స్వేకరించారు. ఈ కార్యక్రమంలో అర్జీల పరిష్కారంపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో, ఉన్నతాధికారుల అదేశాల అమలులో కొంతమంది జిల్లా అధికారులు అలసత్వం వహిస్తున్నారని, అర్జీలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబందించిన అర్జీల పరిష్కార స్థితిపై రోజువారీ సమీక్ష నిర్వహించుకోవాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 198 అర్జీలు అందజేశారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 32 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి వారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందల్, ఏఎస్పీసౌమ్యలతలు పాల్గొని 32 ఫిర్యాదులు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదు దారుల ముందే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్స్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు వివరించారు. ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలుచేపట్టాలని సంబంధిత శాఖ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్

అర్జీలు రీ ఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలి