ఏకలవ్య పాఠశాలను సందర్శించిన నోడల్‌ అధికారి | - | Sakshi
Sakshi News home page

ఏకలవ్య పాఠశాలను సందర్శించిన నోడల్‌ అధికారి

Aug 5 2025 11:07 AM | Updated on Aug 5 2025 11:07 AM

ఏకలవ్

ఏకలవ్య పాఠశాలను సందర్శించిన నోడల్‌ అధికారి

మక్కువ: మండలంలోని అనసభద్ర గ్రామం సమీపంలోని ఏకలవ్య పాఠశాలను నోడల్‌ అధికారి, డిప్యూటీ ఎంపీడీవో ఎన్‌.సూర్యనారాయణ సోమవారం సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థులు తరగతి గదులను, విద్యార్థులు హాజరు, భోజనమెనూ, పాఠశాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే మరుగుదొడ్లు అసంతృప్తికరంగా ఉన్నట్లు గుర్తించారు. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాల్సి ఉందన్నారు. ఆర్వో తాగునీరు అవసరమని, పాఠశాల ఆవరణ చదును చేయాల్సి ఉందని, ఇన్వర్టర్లు, జనరేటర్‌ అవసరమున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో సూర్యనారాయణ గుర్తించారు. పై సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయన తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు పార్వతీపురం యోగా సాధకులు

పార్వతీపురం రూరల్‌: జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు ముగిశాయి. ఈ మేరకు పది నుంచి ఏబై ఏళ్ల వయస్సు గల క్రీడాకారులు ప్రతిభ చూపించారు. ఈ సందర్భంగా వారికి సోమవరం ప్రశంసాపత్రాలు, పతాకాలు అందించారు. ఈ సందర్భంగా పోటీల పరిశీలకుడు భాస్కరరావు మాట్లాడుతూ గెలుపొందిన విజేతలకు ఈ నెల 21నుంచి 24 వరకు తాడేపల్లె గూడెంలో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు.

గంజాయి నిందితుడి అరెస్టు

శృంగవరపుకోట: గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని కేరళ రాష్ట్రంలో పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌.కోట సీఐ వి.నారాయణమూర్తి చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్‌లో కేరళ రాష్ట్రానికి చెందిన బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు 117కిలోల గంజాయితో పట్టుబడ్డారన్నారు. ఈ కేసులో కేరళ నుంచి వాహనాన్ని పంపి గంజాయి తెమ్మని చెప్పిన కేరళ రాష్ట్రం, త్రిశూర్‌ జిల్లా కట్టూర్‌ పట్టణానికి చెందిన శ్రీజిత్‌ను కేరళ పోలీసుల సహకారంతో పట్టుకుని అరెస్టు చేసి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు ఎస్‌.కోట తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో కేవలం పట్టుబడిన నిందితులపైనే కాకుండా, ప్రోత్సహిస్తున్న మూలాలను వెదికి పట్టుకుని కేసులు పెడుతున్నామన్నారు.

మృతుడి ఆచూకీ లభ్యం

వేపాడ: మండలంలోని నీలకంఠరాజపురం గ్రామంలో రైవాడ కల్వర్టు వద్ద గుర్తుతెలియని వాహానం ఢీకొనడంతో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినట్లు వల్లంపూడి ఎస్సై సుదర్శన్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఆర్దరాత్రి రైవాడ కాలువ కల్వర్టువద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన విషయం విదితమే. ఈ సంఘటనపై పలు పత్రికల్లో వచ్చిన వార్తలతో కుటుంబసభ్యులు గుర్తించి వల్లంపూడి స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గజపతినగరానికి చెందిన పీలా శివశంకర్‌ (41) ప్రమాదంలో మృతిచెందినట్లు చెప్పారు. సమాచారం తెలుసుకున్న శివశంకర్‌ భార్య పార్వతి స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. మృతిచెందిన శివశంకర్‌ విశాఖలోని మధురవాడలో ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌లో వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. రెండోతేదీన ఎస్‌.కోట వివేకానంద కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న కుమార్తెను చూడడానికి వెళ్లి తిరిగి వస్తుండగా నీలకంఠరాజపురం రైవాడ కల్వర్టు వద్ద ప్రమాదంలో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడు శివశంకర్‌కు భార్య పార్వతి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పార్వతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఢీ కొన్న గుర్తుతెలియన వాహనంపై బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఏకలవ్య పాఠశాలను సందర్శించిన నోడల్‌ అధికారి1
1/2

ఏకలవ్య పాఠశాలను సందర్శించిన నోడల్‌ అధికారి

ఏకలవ్య పాఠశాలను సందర్శించిన నోడల్‌ అధికారి2
2/2

ఏకలవ్య పాఠశాలను సందర్శించిన నోడల్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement