
బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలను అందించాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: బిడ్డపుట్టిన గంటలోపు తల్లిపాలు అందించాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో తల్లిపాల వారోత్సవాలు పోస్టర్స్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 7వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. తల్లిపాలు అమృతంతో సమానమన్నారు. తల్లిపాలు ప్రాముఖ్యతను వివరించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జీవనరాణి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవి మాధవి, డీఐవో అచ్చుతకుమారి, అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాణి, ఎన్‌సీడీ పీవో డాక్టర్ సుబ్రమణ్యం, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ సాయిరాం, ఐసీడీఎస్ పి.డి డాక్టర్ విమలరాణి తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలు బిడ్డకు రక్షణ
విజయనగరం ఫోర్ట్: తల్లిపాలు బిడ్డకు రక్షణ అని ఐసీడీఎస్ పి.డి టి.విమలారాణి తెలిపారు. పట్టణంలోని సాలిపేట, బొబ్బాదిపేట, గోకపేట అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా శనివా రం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని అది పిల్లలు వ్యాధి బారిన పడకుండా కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో జి.ప్రసన్న, సూపర్ వైజర్ మేరి వనిత, అంగన్‌వాడీ కార్యకర్తలు బి.సత్యవేణి, కె.గాయిత్రి, ఆర్.వెంకటరత్న పాల్గొన్నారు.