
3,638
8,243
మెంటాడ మండలం లోతుగెడ్డకు చెందిన బి.అప్పలరాజు, లక్ష్మీపార్వతి దంపతులు జూన్ నెలలో రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు రైస్ కార్డు మంజూరు కాలేదు.
‘ గంట్యాడ మండలం మధుపాడ గ్రామానికి చెందిన టి.నారాయణమూర్తికి ఈ ఏడాది మార్చిలో ప్రియ అనే అమ్మాయితో వివాహం అయింది. జూన్ నెలలో కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రైస్ కార్డు వస్తే నిత్యావసర సరుకులు అందుతాయని, జీవన భరోసా దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.’
● కొత్త రైస్ కార్డుల మంజూరు ఊసెత్తని కూటమి సర్కారు
● దరఖాస్తు చేసి నెలలు గడిచినా అందని కార్డులు
జిల్లాలో రైస్ కార్డుల కోసం
అందిన దరఖాస్తులు
విజయనగరం ఫోర్ట్:
రైస్ కార్డు.. పేదలకు గుర్తింపు కార్డు వంటిది. పిల్లల ఫీజుల రాయితీకి, ఆదాయ ధ్రువీకరణ పత్రం మంజూరుకు అదే ఆధారం. సంక్షేమ పథకాలు వర్తించాలన్నా రైస్ కార్డే ప్రధానం. ఇంతటి ప్రాధాన్యమున్న కార్డుల మంజూరులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం అర్హులకు శాపంగా మారింది. ఆవేదనకు గురిచేస్తోంది. జిల్లాలో కొత్త రైస్‌కార్డులు, స్పిల్టింగ్ (విభజన) కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి నిరాశే ఎదురవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచినా ఇంత వరకు ఒక్కరికి కూడా కొత్త రైస్ కార్డు మంజూరు కాలేదు. కనీసం కార్డుల విభజనకు కూడా అవకాశం ఇవ్వలేదు. కార్డుల్లో పేర్ల తొలగింపు, ఆధార్ సీడింగ్, కార్డులో కొత్తగా చేర్పులు, అడ్రస్ మార్పులు జరగక వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు.
● ఆప్షన్‌తో సరిపెట్టేసింది..!
కూటమి సర్కారు కొత్త రైస్ కార్డులు, స్పిల్టింగ్ కోసం ఆప్సన్‌తో సరిపెట్టేసింది. కొత్త రైస్ కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 3,648 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక్కరికి కూడా మంజూరుకాలేదు. స్పిల్టింగ్ కోసం 8,243 మంది దరఖాస్తు చేసి ఎదురుచూస్తున్నారు. ఎవరైనా చనిపోతే వెంటనే పేరు తొలగించి సరుకులు నిలిపివేస్తున్న ప్రభుత్వం కొత్తకార్డుల జారీ, చేర్పులు, మార్పులకు అవకాశం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి ఆరునెలలుగా ఒకసారి కొత్తగా దరఖాస్తు చేసుకునేవారిలో అర్హులకు కార్డులు మంజూరు చేసేదని, చేర్పులు, మార్పులకు నిరంతరం అవకాశం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవంటూ పలువురు వాపోతున్నారు.

3,638