
శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి
● జిల్లా విద్యాశాఖాధికారి
మాణిక్యంనాయుడు
మెరకముడిదాం: ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులంతా పనిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు సూచించారు. మండలంలోని గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవా రం ఆకస్మికంగా తనిఖీచేశారు. మధ్యాహ్న భోజన పథకం తీరుపై ఆరా తీశారు. మరుగుదొడ్ల నిర్వహణను నేరుగా పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారి నుంచి జవాబులు రాబట్టారు. ప్రత్యేకంగా గణితంలో ప్రతి విద్యార్థికి నూటికి నూరు మార్కులు వచ్చేలా తీర్చిదిద్దాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ దర్శ శ్రీను, హెచ్‌ఎం సూర్యనారాయణ ఉన్నారు.
అరకు–విశాఖ రోడ్డులో
145 కేజీల గంజాయి పట్టివేత
● ఇద్దరి అరెస్టు
లక్కవరపుకోట: ఒడిశా నుంచి నుంచి కేరళ రాష్ట్రానికి అరకు–విశాఖ జాతీయ రహదారిలో బొలెరో వాహనంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన మహ్మద్ సఫీ, ఒడిశాకు చెందిన దుంబిలను గొల్జాం కూడలి వద్ద పోలీస్‌లు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 145 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ నవీన్‌పడాల్ తెలిపారు. ఇద్దరినీ కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపర్చగా రిమాండ్ విధించారన్నారు.
తల్లిపాలు ఆరోగ్యకరం
● కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: తల్లిపాలు ఆరోగ్యకరం, అమృతంతో సమానమని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో తల్లిపాల ప్రాముఖ్యతను తెలిపే వాల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు తాగించాలని సూచించారు. తల్లిపాలలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌జేడీ జి.చిన్మయిదేవి, పీడీ టి.విమలారాణి, సీడీపీఓలు ప్రసన్న, ఉమాభారతి, ఆరుద్ర, తదితరులు పాల్గొన్నారు.
స్వీయ రక్షణ విద్యలో శిక్షణ
విజయనగరం క్రైమ్: పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులతో పాటు పీడీలు, పీఈటీలకు స్వీయరక్షణ విద్యపై జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో శిక్షణ సాగింది. విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ అశోక్‌కుమార్ శిక్షణను పర్యవేక్షించారు.

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి