
పోటా పోటీగా హ్యాండ్‌బాల్ పోటీలు
శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయలో హైదరాబాద్ రీజియన్ హ్యాండ్‌బాల్ మీట్ –2025–26 పోటీలు రెండవ రోజు మంగళవారం హోరాహోరీగా సాగాయి. పోటీల్లో 195 మంది, బాలురు, 183 మంది బాలికలు అండర్–19, అండర్–17, అండర్–14 విభాగాల్లో తలపడుతున్నారు. పోటీలకు వచ్చిన దక్షిణ భారతదేశంలోని నవోదయ విద్యాలయాలైన యానాం, ఆదిలాబాద్, కన్నూర్, కరైకల్, ఎర్నాకుళం, హవేరి, హాసన్, కలబుర్గిల నుంచి వచ్చిన విద్యార్థులు పోటాపోటీగా తలపడుతున్నారు. గురువారం విజేతలను నిర్ణయించి బహుమతి ప్రదానం చేస్తామని, విజేతలు బీహార్‌లో నలందలో నిర్వహించనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్.రాజారావు చెప్పారు.