
మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరం
విజయనగరం లీగల్: మానవ అక్రమ రవాణా హేయమైన చర్య అని ఇది వ్యవస్థీకృత నేరమని ఈ దోపిడీని అంతం చేయాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలోని మహిళా ప్రాంగణంలో బుధవారం న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మహిళలు చిన్నపిల్లలను అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ రవాణా బాధితుల హక్కుల రక్షణ వారి భద్రతలే ప్రధాన అంశంగా పోలీస్ యంత్రాంగం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పనిచేస్తుందని అక్రమ రవాణా బాధితులకు రక్షణ నష్టపరిహారం, పునరావాసంతో పాటు వారికి తగిన న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థతో పాటు పోలీసు యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. పిల్లల అక్రమ రవాణాపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆర్.గోవిందరావు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారి టి.విమల కుమారి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎస్‌డీవీ ప్రసాద రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ జి హిమబిందు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బీహెచ్ లక్ష్మి, పోలీస్ అధికారులు, యూత్ క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.ప్రసాద రావు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రసాద్