
పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నికకు నోటిఫికేషన
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఎన్నికలు రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు వచ్చేనెల 16న స్థానిక జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నిర్వహిస్తామని ప్రస్తుత జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.మురళి, ఎ.సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎన్నిక నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసి జిల్లా శాఖ కార్యాలయం నోటీస్ బోర్డులో ప్రదర్శనకు ఉంచినట్లు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికలకు పరిశీలకులుగా విశాఖ జిల్లా పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్‌జీజీఓ జాయింట్ సెక్రటరీ ఎన్‌ఎంకేజీప్రసాద్ వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికల అధికారిగా విజయనగరం జిల్లా ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు టి.శ్రీధర్‌బాబు, సహాయ ఎన్నికల అధికారిగా విజయనగరం జిల్లా పట్టణ ఏపీఎన్‌జీఓ అసోసియేట్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నియమితులయ్యారని పేర్కొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని తాలూకా యూనిట్‌లలో ఉన్న ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనాలని ఎన్నికల అధికారి శ్రీధర్ కోరారు. నోటిఫికేషన్ విడుదల కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, రమణమూర్తి, ఆంజనేయ వర్మ, పరిషత్ యూనిట్ అధ్యక్షులు కేఎస్‌శ్రీనివాసరావు, ఎల్‌వీ ప్రసాద్, వీవీరమణమూర్తి, ఎం.హేమలత, వనిత, సూర్యనారాయణ పాల్గొన్నారు.