
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పెద్ద పీట
సాలూరు: రానున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు రాజన్నదొరను పట్టణంలోని ఆయన స్వగృహంలో బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ,శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం జిల్లాల అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ వీరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై చర్చించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ, నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జిల్లా, మండల స్థాయి అనుబంధ విభాగాల కమిటీల నియామకం ఇప్పటికే పూర్తయిందన్నారు. గ్రామ, వార్డు స్థాయి కమిటీల నియామకం త్వరలోనే పూర్తిచేస్తామని చెప్పారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన పీఏసీ సమావేశంలో అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా రానున్న జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి , వారే రాజు మంత్రి అనే విధంగా కార్యకర్తలను చూసుకుంటామని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపిన విషయాలను ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో కూటమి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై చర్చించారు.
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర