
అంగన్‌వాడీ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య
● కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఈ మేరకు ఆయన తన చాంబర్‌లో మంగళవారం అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్యను ప్రోత్సహించేందుకు పూర్వ శ్రేణి పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెల 4వ శనివారం నిర్వహిస్తున్న పూర్వ శ్రేణి విద్యా దినోత్సవం బాలల మనసిక, శారీరక, భాష, సాంఘిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలారాణి, నోడల్ అధికారి తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.