
హోంగార్డ్స్ సంక్షేమానికి చర్యలు
● ఎస్పీని కలిసిన విశాఖ రేంజ్ కమాండెంట్ జోషి
విజయనగరం క్రైమ్: విశాఖ రీజియన్ హెూంగార్డ్స్ కమాండెంట్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎ.జోషి తొలిసారి జిల్లాకు వచ్చి, ఎస్పీ వకుల్ జిందల్‌ను మర్యాద పూర్వకంగా మంగళవారం కలిసి, పూల మొక్కను అందజేశారు. హెూంగార్డ్స్ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ వకుల్ జిందల్ తో ఈ సందర్భంగా చర్చించారు. ఆపై వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని చెప్పారు. అనంతరం ఆయన హోంగార్డులతో సమావేశమై, విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను హోంగార్డు కుటుంబాలకు వర్తింపజేయాలని, విధి నిర్వహణలో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ప్రయాణించేందుకు బస్ పాస్ వంటి సౌకర్యాలను కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని హోం గార్డులు కోరగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హోంగార్‌ుడ్స నిర్వహించిన పరేడ్ ను కమాండెంట్ పరిశీలించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఆర్.రమేష్ కుమార్, ఆర్‌ఎస్సై ముబారక్ అలీ, హెూంగార్డ్స్ ఇన్చార్జ్ హెచ్‌సీలు రాజు, శ్రీనివాసరావు, హెూంగార్డులు పాల్గొన్నారు.