
జాతీయస్థాయి దివ్యాంగుల పోటీల్లో ‘తోషిని’కి కాంస్య పతకం
● ఈనెల 24 నుంచి 28వరకు
బిలాస్‌పూర్‌లో జరిగిన పోటీలు
తెర్లాం: జాతీయస్థాయిలో జరిగిన దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 పోటీల్లో తెర్లాం హైస్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని అడ్డా తోషిని ‘బోసి గేమ్’ వ్యక్తిగత హయ్యర్ ఎబిలిటీ విభాగంలో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. ఈఏడాది ఏప్రిల్ నెలలో నూజివీడులోని అగిరిపల్లి హిల్ పారడైజ్ స్కూల్‌లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ రాష్ట్ర స్పెషల్ ఒలింపిక్ భారత్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధిండంతోపాటు, దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్ భారత్–2025 జాతీయ స్థాయి పోటీలకు తోషిని ఎంపికై న విషయం తెలిసిందే. ఈనెల 24 నుంచి 28వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయ్ యూనివర్సిటీ మైదానంలో జాతీయ స్థాయి దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొన్న తోషిని తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుని కాంస్య పతకాన్ని సాధించింది. జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించిన తోషినిని రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు, జిల్లా అధికారులు, హైస్కూల్ హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.