గుడ్డు సంపూర్ణ పోషకాహారం: ఎంపీ శ్రీభరత్‌ | - | Sakshi
Sakshi News home page

గుడ్డు సంపూర్ణ పోషకాహారం: ఎంపీ శ్రీభరత్‌

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

ఏయూక్యాంపస్‌: గుడ్డు పోషకాలను అందించి ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడుతుందని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు. వరల్డ్‌ ఎగ్‌ డే సందర్భంగా నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) విశాఖ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత నెక్‌ వ్యవస్థాపకులు బి.వి.రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీభరత్‌ మాట్లాడుతూ ప్రజల్లో గుడ్డు వినియోగంపై అవగాహన కల్పిస్తున్న నెక్‌ ప్రతినిధులను అభినందించారు. రోజువారీ ఆహారంలో గుడ్డును భాగం చేసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారులకు గుడ్లు అందించడం ద్వారా వారి పోషకాహార అవసరాలు తీరుతున్నాయని తెలిపారు. నెక్‌ జోనల్‌ చైర్మన్‌ టి.శ్రీధర్‌ మాట్లాడుతూ గుడ్డులోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరించడమే కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు , గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ నెక్‌ చేస్తున్న అవగాహన కార్యక్రమాలు సామాజిక సేవతో సమానమన్నారు. ఏపీపీ ఎఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టి.యు.భాస్కర్‌ , పలువురు నెక్‌, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడ్డుతో తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను రాయితీపై విక్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement