దురంతో ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ల్లో మార్పులు | - | Sakshi
Sakshi News home page

దురంతో ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ల్లో మార్పులు

Feb 25 2026 10:38 AM | Updated on Feb 25 2026 10:38 AM

దురంతో ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ల్లో మార్పులు

దురంతో ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ల్లో మార్పులు

తాటిచెట్లపాలెం : విశాఖపట్నం–సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య నడుస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ల్లో పలు మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌–విశాఖపట్నం (22204) దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌ 22వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–సికింద్రాబాద్‌ (22203)దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌ 23వ తేదీ వరకు 1–ఫస్ట్‌ ఏసీ, 4–సెకండ్‌ ఏసీ, 12–థర్డ్‌ ఏసీ, 3–స్లీపర్‌ క్లాస్‌, 2–జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ /లగేజి /దివ్యాంగ్‌ కోచ్‌లతో నడుస్తుంది.

ఏప్రిల్‌ 25 నుంచి శాశ్వతంగా..

సికింద్రాబాద్‌–విశాఖపట్నం (22204) దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి, తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–సికింద్రాబాద్‌ (22203)దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌ 26వ తేదీ నుంచి 1–ఫస్ట్‌ ఏసీ, 4–సెకండ్‌ ఏసీ, 14–థర్‌ ఏసీ, 2–సెకండ్‌ క్లాస్‌ కం లగేజి/ దివ్యాంగ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన నడుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement