3న అప్పన్న డోలోత్సవం | - | Sakshi
Sakshi News home page

3న అప్పన్న డోలోత్సవం

Feb 25 2026 10:38 AM | Updated on Feb 25 2026 10:38 AM

3న అప్పన్న డోలోత్సవం

3న అప్పన్న డోలోత్సవం

సింహాచలం: ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించు కుని మార్చి 3న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి డోలోత్సవాన్ని పుష్కరిణి సత్రం ప్రాంగణంలోని ఉద్యానవన మండపంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ వో జె.వెంకటరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో వైదిక కార్యక్రమాలు, ఉత్సవ నిర్వహణ సమయాల్లో మార్పులు చేసినట్లు పేర్కొ న్నారు. 3న తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవ, 3.30 గంటలకు బాలభోగం, ఆరాధన పూర్తిచేసి.. అనంతరం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, చూర్ణోత్సవం నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు స్వామి ఉత్సవమూర్తులను మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకొస్తారు. అక్కడ ఉద్యానవన మండపంలో డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి తిరువీధి నిర్వహించి, తిరిగి స్వామివారిని కొండపైకి తీసుకెళ్తారు.

Advertisement
 
Advertisement
Advertisement