తప్పిన పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం

కొమ్మాది: మధురవాడ నుంచి నగరంవైపు వెళ్తున్న భారీ కంటైనర్‌ ఒక్కసారిగా అదుపు తప్పి ఎండాడ జాతీయ రహదారి వద్ద కొండవైపు దూసుకుపోయింది. దీనితో ఈ కంటైనర్‌ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. సుమారు గంట పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో మధురవాడ వైపు వెళ్లే ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో జాతీయ రహదారిపై భారీ వాహనాలకు రాకపోకలకు పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారని పలువురు ప్రశ్నించారు. అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకుని ట్రాఫిక్‌ను మల్లించారు.

Advertisement
 
Advertisement
Advertisement