ఆచరణ | - | Sakshi
Sakshi News home page

ఆచరణ

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

ఆచరణ

ఆచరణ

రూ.5 కోట్లతో ఔత్సాహిక

పారిశ్రామికవేత్తల కోసం

‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ ఏర్పాటు

ఐఐఎం విద్యార్థులతో పాటు సాధారణ

ప్రజలకు కూడా అవకాశాలు

డిజిటల్‌ నైపుణ్యాల నుంచి లాభదాయక

వ్యాపార నిర్వహణ వరకు సమగ్ర శిక్షణ

ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి కేంద్ర

ప్రభుత్వ సహకారంతో ‘స్ఫూర్తి’ పథకం

వనరులు లేని ప్రతిభావంతుల కోసం

‘మహాత్మా గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌’

ఆలోచన
మీ
మా
మెంటార్‌షిప్‌ హబ్‌గా ఐఐఎం విశాఖపట్నం సామాన్యుడ్ని సైతం పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే దిశగా అడుగులు

సమాజంలో మార్పులకు దోహదపడే విధానాలను ప్రోత్సహిస్తూ ఔత్సాహిక

పారిశ్రామికవేత్తలకు చేయూతనందించాలని ఐఐఎం–విశాఖపట్నం నిర్ణయించింది. కేవలం తమ విద్యార్థులకే పరిమితం కాకుండా, సామాన్యుడ్ని సైతం విజయవంతమైన

పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందుకోసం

రూ.5 కోట్ల నిధులతో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ (సీవోఈ)ను స్థాపించింది. డిజిటల్‌

నైపుణ్యాల నుంచి వ్యాపార లాభదాయకత (డివిడెండ్‌) వరకు వివిధ అంశాల్లో శిక్షణ

అందించనుంది. ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘స్ఫూర్తి’

పథకాన్ని అమలు చేస్తూనే, నైపుణ్యం ఉన్నా.. వనరులు లేని వారికి ‘మహాత్మా గాంధీ

నేషనల్‌ ఫెలోషిప్‌’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది.

సాక్షి, విశాఖపట్నం: ఏడాది క్రితం ఐఐఎంవీ సామాజిక వ్యాపారవేత్తల కోసం ప్రత్యేక స్టార్టప్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ‘వాల్యూ ఫర్‌ మనీ’ లక్ష్యంతో, సమాజంలో ఉన్న సమస్యలకు వ్యాపారాధారిత పరిష్కారాలు చూపే యువతకు ‘సోషల్‌ ఇంపాక్ట్‌ ప్రెన్యూర్స్‌ ప్రోగ్రామ్‌’ ద్వారా మార్గదర్శనం చేస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకే పరిమితం కాకుండా, శక్తివంతమైన ‘మెంటార్‌షిప్‌ హబ్‌’గా రూపాంతరం చెందుతోంది. కేవలం పట్టాలు అందించే విద్యాసంస్థగా కాకుండా, పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే కర్మాగారంగా అభివృద్ధి చెందుతోంది. ఇటీవల ఐఐఎంవీ ప్రాంగణంలో మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రొఫెషనల్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (ఎంఈపీఎస్‌సీ) సహకారంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రారంభమైంది. సుమారు రూ.5 కోట్ల నిధులతో ఏర్పాటైన ఈ కేంద్రం, ఐఐఎంవీ విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. పరిశోధనలు, మార్కెట్‌ అవగాహన, ప్రభుత్వ విధానాల మధ్య వారధిగా పనిచేస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దిక్సూచిగా నిలవనుంది.

సామర్థ్య నిర్మాణమే లక్ష్యం

ఈ సీవోఈ పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వ్యాపారపరమైన నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్‌ నైపుణ్యాలు వంటి విభిన్న రంగాల్లో శిక్షణ ఇవ్వనుంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) ఆధునిక సాంకేతికతను వినియోగించి అంతర్జాతీయ స్థాయికి ఎదగేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి. సామాజిక బాధ్యతలో భాగంగానే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఐఐఎంవీ ప్రకటించింది.

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

మహిళల సాధికారతకు ఐఐఎం–వి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు మూడు బ్యాచ్‌లను విజయవంతంగా పూర్తిచేసి, పదుల సంఖ్యలో మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసింది. ‘వుమెన్‌ స్టార్టప్‌ ప్రోగ్రామ్స్‌’ ద్వారా ఇంటి నుంచే వ్యాపార ఆలోచనలు చేసే మహిళలకు మార్గదర్శనం అందిస్తోంది. మెంటార్‌షిప్‌, నెట్‌వర్కింగ్‌, ఇంక్యుబేషన్‌ సౌకర్యాల ద్వారా వారి ఆలోచనలను లాభదాయక సంస్థలుగా మార్చేందుకు సహకరిస్తోంది.

యువతకు ‘ఫెలోషిప్‌

‘వికసిత్‌ భారత్‌–2047’ లక్ష్య సాధనలో భాగంగా, సమాజంలోని అట్టడుగు వర్గాల యువతకు పారిశ్రామిక నైపుణ్యాలు అందించడంపై ఐఐఎంవీ దృష్టి సారించింది. నైపుణ్యం ఉన్నా.. వనరులు లేని వారికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా ఆర్థిక, సాంకేతిక సహకారం అందించనుంది. అదనంగా, ‘మహాత్మా గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌’ (ఎంజీఎన్‌ఎఫ్‌) ద్వారా దేశవ్యాప్తంగా ఎంపికై న జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నేర్చుకోవడమే

నిరంతర ప్రక్రియ

వ్యాపార రంగంలో రాణించాలంటే పట్టుదల, లక్ష్యసాధనపై దృష్టి, నిరంతర అభ్యాసం ఎంతో ముఖ్యం. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే తత్వమే ఒక సాధారణ వ్యక్తిని గొప్ప పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దుతుంది. ఈ దిశగా ఐఐఎంవీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను స్థాపించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాపార, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించి, విశాఖను స్టార్టప్‌ల కేంద్రంగా తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని ఆయన తెలిపారు.

– ప్రొ. చంద్రశేఖర్‌, డైరెక్టర్‌, ఐఐఎంవీ

ఆచరణ1
1/2

ఆచరణ

ఆచరణ2
2/2

ఆచరణ

Advertisement
 
Advertisement
Advertisement