రాత్రి పూట విషవాయువులు వెదజల్లుతున్నాయి
భూ ఉపరితలం నుంచి పైకెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి. దీన్నే ఇన్వర్షన్ లేయర్ అంటారు. ఇది ఒక లిడ్‌లా మారిపోయింది. పరిశ్రమలు రాత్రి వేళల్లో రసాయన వాయువులు వెదజల్లుతుంటాయి. ఇన్వర్షన్ లేయర్ వల్ల ఈ వాయువులు పైకెళ్లే పరిస్థితులు కనిపించక.. కాలుష్యం పెరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరం. ఈ వాయువుల కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. కార్సినోజెనిక్ వాయువులతో పాటు గతంతో పోలిస్తే.. ధూళి కణాలు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా పరిగణించవచ్చు. చెట్లు పెంచడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం.
– ప్రొ.భానుకుమార్, పర్యావరణ నిపుణుడు


