ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
విశాఖ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన సత్వరమే పరిష్కరించాలని మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 13 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. నిర్ణీత వ్యవధిలో న్యాయపరంగా చిక్కులు లేనివాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వచ్చిన ఫిర్యాదుల్లో ప్రణాళిక విభాగానికి చెందినవి 6, పరిపాలన విభాగానివి 4, ఇంజనీరింగ్‌కు 3 ఉన్నాయి.


