కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు 207 వినతులు
మహారాణిపేట: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో 207 వినతులను కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్‌తో పాటు పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి శేష శైలజ, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణిలు స్వీకరించారు. వినతుల్లో అత్యధికంగా జీవీఎంసీకి సంబంధించి 90 ఉండగా, పోలీస్ విభాగానికి చెందినవి 21, ఇతర శాఖలకు సంబంధించినవి 96 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అన్ని విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై
కలెక్టర్‌కు వినతి
ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉత్తర శాసనసభ్యుడు పి.విష్ణుకుమార్‌రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు నేతృత్వంలో సోమవారం విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు నేటి నుంచి ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటూ, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అత్తిలి శంకరరావు, ఎ.కేశవకాంత్, అధికార ప్రతినిధి కె.సుహాసిని ఆనంద్, కె.ఎన్.పిచక్రవర్తి, శ్రీరంగం ధనేశ్వరరావు, పురుషోత్తం, శ్రీనివాసరావు, ఎం.సురేష్‌బాబు,ఆర్.విజయ చంద్రుడు, ఎం.ప్రకాష్, పి.వి.కృష్ణారావు, నాదేళ్ల జ్యోతి పాల్గొన్నారు.
అర్జీల వివరాలు నమోదు చేస్తున్న కలెక్టరేట్ సిబ్బంది
కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు 207 వినతులు


