వార్డు, బూత్ కమిటీలను త్వరగా నియమించండి
అల్లిపురం: వచ్చే 2029 అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. అన్ని వార్డుల్లోనూ కమిటీల నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలోని 30, 32, 33, 34, 36, 37, 38, 39, 41వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా పార్టీ శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఆయా వార్డుల్లో బూత్ అధ్యక్షులు, వార్డ్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బూత్, వార్డు స్థాయిల్లోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, ఆయా పదవులకు సంబంధించిన ఆశావహుల బయోడేటాలను త్వరగా అందజేయాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట పద్మావతి, కోడిగుడ్ల పూర్ణిమ, పార్టీ జిల్లా కార్యదర్శి గనగళ్ల రామరాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భారత్, పార్టీ ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు వడ్డాది దిలీప్, జిల్లా కార్యదర్శి బొడ్డు ఆనంద్, నాయకుడు పచ్చిపల్లి రాము, రాష్ట్ర నాయకులు లింగం శ్రీను, రాష్ట్ర అనుబంధ సంఘాల కార్యదర్శులు సాగర్, భాను, వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, ముత్తబత్తుల రమేష్, మహమ్మద్ షాకిల్, గురజారపు రవి, చేపల నూకరాజు, ముజీబ్ ఖాన్, జిల్లా అనుబంధ సంఘాల ఉపాధ్యక్షులు కోన శంకర్, గుంటూ ఆనంద్, దూడ అప్పారావు, దక్షిణ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఆకుల శ్యామ్, బాబ్జి, సూర్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.
వార్డు, బూత్ కమిటీలను త్వరగా నియమించండి
వార్డు, బూత్ కమిటీలను త్వరగా నియమించండి


