బ్రిడ్జి కోర్సు శిక్షణకు దరఖాస్తులు
కంచరపాలెం: పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) పూర్తి చేసిన అభ్యర్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ ప్రభుత్వ పాత ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. సోలమన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారంలోగా తమ దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని కోరారు. ఐటీఐలో 60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ప్రవేశాలకు అర్హులని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు పదో తరగతి, ఐటీఐ మార్కుల జాబితా, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను జత చేయాల్సి ఉంటుందని వివరించారు. అర్హత పొందిన అభ్యర్థులకు సోమవారం నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు బ్రిడ్జి కోర్సులో శిక్షణ ఇస్తామని, ఇతర వివరాల కోసం ట్రైనింగ్ ఆఫీసర్ కె. నాగశ్రీని సంప్రదించాలని సూచించారు.


