మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి పూలే
మహారాణిపేట: మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే అని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కొనియాడారు. శనివారం వైఎస్సార్ సీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, డిప్యూటీ మేయర్ కె.సతీష్‌తో కలిసి కేకే రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలికల విద్యే సమాజ అభివృద్ధికి పునాది అనే భావనను ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్తగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు జహీర్ అహ్మద్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, సునీల్ మెత్త, బోని శివరామకృష్ణ , శ్రీదేవి వర్మ, నీలి రవి, మారుతి ప్రసాద్, పీలా ప్రేమకుమార్, దిలీప్, సేనాపతి అప్పారావు, మార్కేండేయులు, అలంపల్లి రాజబాబు, కార్పొరేటర్ బిపిఎన్ కుమార్ జైన్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


