కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది
శీతల గాలులు, వాతావరణ మార్పుల వల్ల వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెంది శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. గత రెండేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది, ముఖ్యంగా డిసెంబర్‌లో రోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. మందుల కొరత లేకుండా స్టాక్ సిద్ధం చేశాం. దగ్గు, ఆయాసం మూడు రోజులకు మించి ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ సునీల్ కుమార్,
సూపరింటెండెంట్, ఛాతీ ఆసుపత్రి


