హాస్టళ్లు, రేషన్ డిపోల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీ
అచ్యుతాపురం రూరల్/ఎస్.రాయవరం : జిల్లాలోని పలు మండలాల్లో హాస్టళ్లు, రేషన్ డిపోల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ చిట్టా విజయ్ ప్రతాప్‌రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అచ్యుతాపురం మండలంలో మోసయ్యపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలో తనిఖీ చేసి, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెదురువాడ అంగన్‌వాడీ కేంద్రం, చోడపల్లి, అచ్యుతాపురం రేషన్ డిపోలు, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్, మోసయ్యపేట, ట్రైబల్ హాస్టల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో దేవరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెంలో పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, సదుపాయాలపై ఆరా తీశారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం, రేషన్ డిపోలను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో కొన్ని సరకులు వివరాలు సక్రమంగా లేకపోవడంతో సూపర్‌వైజర్‌ని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.


