అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం
కలెక్టర్
హరేందిర ప్రసాద్
కలెక్టరేట్‌లో
కొత్త ఏడాది సందడి
మహారాణిపేట: కలెక్టరేట్‌లో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్.. కలెక్టరేట్ సిబ్బందితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026 జిల్లాకు అన్ని రంగాల్లో పురోగతి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని సూచించారు. బాధ్యతాయుత పాలన, పారదర్శకత, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ప్రత్యేక ఉప కలెక్టర్లు, వివిధ విభాగాల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలను ముగించారు.
● నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలెక్టర్‌ను పలువురు ఉన్నతాధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు, అలాగే సంజీవని నిధికి చెక్కులను అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జేసీ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పలు సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు.
అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం
అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం


