ఎస్‌ఎంఎస్–2లో రికార్డు హీట్ల ఉత్పత్తి
ఉక్కునగరం : స్టీల్ మెల్ట్‌షాప్–2లో మంగళవారం ఎక్కువ హీట్లు ఉత్పత్తి చేశారు. ఉదయం ఏ షిఫ్ట్‌లో 20 హీట్లు, బీ షిఫ్ట్‌లో 26 హీట్లు, సీ షిఫ్ట్‌లో 30 హీట్లు వెరసి మూడు షిఫ్ట్‌ల్లో మొత్తం 76 హీట్లుతో గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక హీట్లు సాధించి రికార్డు ఉత్పత్తి సాధించారు. ఇంతకు ముందు 2025 ఆగస్టు 12న అత్యధికంగా 72 హీట్లు సాధించగా డిసెంబర్ 24న 73 హీట్లు సాధించి ఆ రికార్డును అధిగమించింది. ఇప్పుడు 76 హీట్లతో ఆ రికార్డును తిరగరాశారు. ఈ సందర్భంగా విభాగం ఉద్యోగులను విభాగాధిపతి, అధికారులు అభినందించారు.


