సౌత్ జోన్ క్రీడా పోటీల్లో సన్‌రిడ్జ్ విద్యార్థుల ప్ర
సబ్బవరం: హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన సౌత్ జోన్ క్రీడా పోటీల్లో స్థానిక సన్‌రిడ్జ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ సత్తా చాటారు. స్కూల్ ఆవరణలో బుధవారం నిర్వహించిన అభినందన సభలో సీఐ జి.రామచంద్రరావు పాల్గొని పలు క్రీడల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్‌తో కలిసి అభినందించారు. జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో సబ్బవరం సర్పంచ్ దెడ్డం ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు యడ్ల నాయుడు, సిరపరపు వాసు తదితరులు పాల్గొన్నారు.


