నవనవోన్మేషంగా...
● కొత్త సంవత్సరం.. కోటి ఆశలతో
● కేరింతలే కాదు.. కెరీర్‌పై ఆలోచనకూ ఓ అడుగు
● వివిధ అంశాల్లో యువత మనోగతం
పెందుర్తి: సరికొత్త ఆశలతో.. ఆలోచనలతో కొత్త ఏడాది మన ముందుకు వచ్చేసింది. కొద్ది గంటల క్రితం కాలగమనంలో కలిసిన పాత సంవత్సరంలో జరిగిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. కలిసొచ్చిన విషయాలను కొనసాగిస్తూ. వాటికి కొత్త ఆలోచనలను జోడించి ముందుకు సాగాల్సిన సమయం వచ్చేసింది. కేరింతలే కాదు.. కెరీర్ కూడా ముఖ్యమని గ్రహించిన యువత ఆ దిశగా.. చదువుతో పాటు వివిధ అంశాల్లో తమ ఆలోచనలకు పదును పెడుతూ వాటిని ఆచరణలో పెట్టేందుకు సంసిద్ధులవుతున్నారు. వారి క్రొంగొత్త ఆలోచనల మనోగతాన్ని ఇలా ఆవిష్కరించారు.


