చదువుతో పాటు క్రికెటర్‌గా రాణిస్తా
మా నాన్న గుప్తా హోంగార్డు. నేను తొలి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాను. మార్కుల విషయంలో రాజీ పడను. అదే సమయంలో నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాలోని ఆసక్తిని గమనించిన మా పీడీ వర్మ సార్ మా కోసం పాఠశాలలో ఏకంగా క్రికెట్ పిచ్‌నే తయారు చేయించారు. ఆయన శిక్షణలో ప్రస్తుతం జిల్లాస్థాయి జట్టుకు ఎంపికై టోర్నీల్లో పాల్గొంటున్నాను. రానున్న రోజుల్లో మరింత రాణించి జాతీయ జట్టుకు ఆడాలన్నదే నా కల. – కళ్లూరి మురళీహర్ష,
జిల్లాస్థాయి అండర్–14 క్రికెటర్, జెడ్పీ హైస్కూల్, గొరపల్లి


