సినిమా రంగంలో అడుగు పెడతా
నేను డిప్లొమా మూడో ఏడాది చదువుతున్నాను. మా నాన్న ఆటో డ్రైవర్. నాకు తొలి నుంచీ సినిమాల మీద ఆసక్తి. ఈ క్రమంలో లేబర్.. సమాజంలో వారు పడుతున్న ఇబ్బందులపై నాలుగు నిమిషాల నిడివితో మా కళాశాల ఆవరణలోనే షార్ట్ ఫిల్మ్ తీశాను. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న శ్రామిక్ ఉత్సవ్‌లో దాన్ని ప్రదర్శించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. నా దగ్గర షార్ట్‌ఫిల్మ్ తీయడానికి సెల్‌ఫోన్ లేదని తెలుసుకుని మా ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ సర్ కొత్త ఫోన్ కొనిచ్చి ప్రోత్సహించారు. రానున్న రోజుల్లో మరిన్ని షార్ట్‌ఫిల్మ్‌లు తీసి సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
– అఫ్జల్ బాబా,షార్ట్ ఫిల్మ్ మేకర్, పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి


