నవ వసంతం.. యువత సంకల్పం | - | Sakshi
Sakshi News home page

నవ వసంతం.. యువత సంకల్పం

Jan 1 2026 10:59 AM | Updated on Jan 1 2026 10:59 AM

నవ వస

నవ వసంతం.. యువత సంకల్పం

కొత్త ఏడాది ప్రణాళికలు సిద్ధం చేసుకున్న గాజువాక విద్యార్థులు

నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలకే పెద్దపీట వేస్తామంటున్న యువత

కాలగమనంలో మరో ఏడాది కరిగిపోయింది. ఎన్నో ఆశలతో మొదలైన 2025.. మరెన్నో తీపి జ్ఞాపకాలను, అనుభవాలను మిగిల్చి చరిత్ర పుటల్లో చేరిపోయింది. గడిచిన ఏడాది నేర్పిన పాఠాలను పునాదిగా చేసుకుని, 2026కి యువత ఘనంగా స్వాగతం పలికింది. నూతన సంవత్సరంలో తమ కలలను సాకారం చేసుకునేందుకు అవసరమైన ప్రణాళికలను ఇప్పుడే రచించుకుంది. ప్రధానంగా విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తామని గాజువాకకు చెందిన పలువురు విద్యార్థులు ‘సాక్షి’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు.

ఆ వివరాలు వారి మాటల్లోనే..

– గాజువాక

సాంకేతిక నైపుణ్యాలే లక్ష్యం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే నిరంతర అభ్యాసం చాలా ముఖ్యం. అందుకే ఈ ఏడాది ఆన్‌లైన్‌ కోర్సులు, ప్రాజెక్టుల ద్వారా నా కంప్యూటర్‌ సైన్స్‌ నైపుణ్యాలను పెంచుకుంటాను. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, డేటా సైన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి అధునాతన సాంకేతికతపై పట్టు సాధించి, వాటిని ప్రాక్టికల్‌గా వినియోగించే స్థాయికి ఎదుగుతాను. భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకునేలా నా కెరీర్‌ను మలుచుకుంటాను.

– ఎం. తులసి, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌,

చైతన్య మహిళా పీజీ కళాశాల

సమయపాలనతోనే విజయం

డిచిన కాలం తిరిగి రాదు.. అందుకే కొత్త సంవత్సరంలో ప్రతి నిమిషాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటాను. వ్యక్తిగత జీవితానికి, చదువుకు మధ్య సమతుల్యత పాటిస్తూ, మరింత బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఎదుగుతాను. నాకున్న జ్ఞానాన్ని సమాజ హితం కోసం వినియోగిస్తాను. ఎటువంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి కట్టుబడి ఉంటాను.

– ఇ. గాయత్రి, ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ,

ఎంవీఆర్‌ డిగ్రీ, పీజీ కళాశాల

చదువుకే నా తొలి ప్రాధాన్యం

ఏడాది సోషల్‌ మీడియా, ఫోను వినియోగాన్ని తగ్గించి, కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంపై దృష్టి సారిస్తాను. దీనివల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా, ప్రాజెక్టులను సులభంగా పూర్తి చేయగలుగుతాను. అనవసరమైన ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకుండా.. మంచి వ్యక్తిత్వంతో భవిష్యత్తును నిర్మించుకోవాలని సంకల్పించాను. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో రాణిస్తాను.

– జి.స్వాతి, ఎం.కాం, చైతన్య మహిళా పీజీ కళాశాల

సవాళ్లను అవకాశాలుగా భావిస్తాను

చదువు పూర్తి చేసుకుని వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. ఎదురయ్యే ప్రతి సవాలును ఒక అవకాశంగా మలుచుకుంటాను. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలకు, బయట ప్రపంచానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేలా నా నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటాను. పరిశోధన, సమాజ సేవకు కట్టుబడి ఉండటంతో పాటు.. తోటివారికి స్ఫూర్తినిచ్చే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటాను.

– బి.మేఘనా సాయి, ఎమ్మెస్సీ అనలైటికల్‌ కెమిస్ట్రీ,

ఎంవీఆర్‌ డిగ్రీ, పీజీ కళాశాల

పరిశోధనపై దృష్టి పెడతా..

నూతన సంవత్సరంలో నా విద్యాభ్యాసానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, పరిశోధనా రంగంలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. కేవలం చదువే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా సమయం కేటాయిస్తాను. నైతిక విలువలతో కూడిన జీవనాన్ని సాగిస్తూ, దేశాభివృద్ధికి ఉపయోగపడే వృత్తిలో స్థిరపడాలన్నదే నా ఆశయం. సమయపాలన పాటిస్తూ లక్ష్యం దిశగా సాగుతాను.

– జె.సత్యనారాయణ,

ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ,

టీఎస్సార్‌, టీబీకే డిగ్రీ, పీజీ కళాశాల

కుటుంబానికి

అండగా నిలబడతా..

ఏడాదితో నా పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తవుతుంది. పట్టా చేతికి రాగానే మంచి ఉద్యోగం సాధించి, నా కుటుంబానికి అండగా నిలవాలన్నదే నా ప్రధాన లక్ష్యం. గతేడాది జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని, కెరీర్‌లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తాను. ఎంతటి సమస్యనైనా చిరునవ్వుతో, ధైర్యంగా ఎదుర్కొనేలా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను. వీలైనంత వరకు నలుగురికీ సాయపడతాను. అలాగే ఈ ఏడాది కొత్త ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటున్నాను.

– టి.శిరీష, ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ,

టీఎస్సార్‌, టీబీకే డిగ్రీ, పీజీ కళాశాల

నవ వసంతం.. యువత సంకల్పం1
1/6

నవ వసంతం.. యువత సంకల్పం

నవ వసంతం.. యువత సంకల్పం2
2/6

నవ వసంతం.. యువత సంకల్పం

నవ వసంతం.. యువత సంకల్పం3
3/6

నవ వసంతం.. యువత సంకల్పం

నవ వసంతం.. యువత సంకల్పం4
4/6

నవ వసంతం.. యువత సంకల్పం

నవ వసంతం.. యువత సంకల్పం5
5/6

నవ వసంతం.. యువత సంకల్పం

నవ వసంతం.. యువత సంకల్పం6
6/6

నవ వసంతం.. యువత సంకల్పం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement