వైభవం.. ఉత్తర ద్వార దర్శనం
మురళీనగర్: కప్పరాడ ఎన్‌జీజీవోస్ కాలనీలోని వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు కనులపండువగా జరిగాయి. ఉదయాస్తమాన సేవాకాలంలో భాగంగా స్వామికి ఉదయం 3 గంటల నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత వైభవ వేంకటేశ్వరస్వామి వారి తిరువీధి ఉత్సవం జరిపారు. ఉత్సవ విగ్రహాలను ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి తీసుకొచ్చి, ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 6 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వజ్రకవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళల కోలాటాలు, బాలికల శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పి.గణబాబు, విష్ణుకుమార్ రాజు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల మల్లిక్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, విశాఖపట్నం పార్లమెంటరీ టీడీపీ ఇన్‌చార్జి పట్టాభి, తదితరులు స్వామిని దర్శించుకున్నారు.
శ్రీదేవి, భూదేవి సమేత వైభవ వేంకటేశ్వరస్వామి, స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
వైభవం.. ఉత్తర ద్వార దర్శనం


