
‘లా నేస్తం’ ఎత్తివేతతో ఇబ్బందులు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘లా నేస్తం’ పథకం ద్వారా ప్రాక్టీస్ చేసే జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేలు అందేవి. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తేయడంతో జూనియర్ న్యాయవాదులు జీవనం కోసం ప్రైవేట్, మార్కెటింగ్ కంపెనీల్లో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో లాయర్ల కోసం కేటాయించిన కార్పస్ ఫండ్‌కు కూడా కూటమి ప్రభుత్వం టోకరా పెట్టింది. లీగల్ సెల్ తరఫున మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.
– బాజినాయుడు, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు