
ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సత్యవతి
డాబాగార్డెన్స్: అనంతపురంలో జరిగిన ఐద్వా (ఆల్ ఇండియా డెమోక్రటిక్ వుమెన్స్ అసోసియేషన్) 16వ రాష్ట్ర మహా సభల్లో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ఐద్వా విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.సత్యవతి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే కమిటీ సభ్యులుగా విశాఖకు చెందిన ఆర్.ఎన్.మాధవి, డి.కొండమ్మలను ఎన్నుకున్నారు. మహిళల హక్కులు, లైంగిక దాడులు, హింసకు వ్యతిరేకంగా ఐద్వా ఇచ్చిన పిలుపును విశాఖలో పటిష్టంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా సత్యవతి తెలిపారు. ఇప్పటికే విశాఖలో మద్యంపై పోరు సాగిస్తున్నట్టు ఆమె వివరించారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, అదానీ గంగవరం పోర్టు కాలుష్యాన్ని అరికట్టాలని, లులూ మాల్, గూగుల్ వంటి సంస్థలకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని చేసిన పోరాటాలను మహాసభ ప్రశంసించిందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి పోరాటాలు కొనసాగిస్తామని సత్యవతి స్పష్టం చేశారు.

ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సత్యవతి

ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సత్యవతి