
సిట్ కాదు.. సీబీఐ దర్యాప్తు కావాలి
భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమిలి చిన్నబజార్ జంక్షన్ నుంచి ఎకై ్స జ్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఎకై ్సజ్ సీఐ పిన్నింటి శ్రీనివాస్‌కు వినతి పత్రాన్ని అందించారు. నకిలీ మద్యం వ్యవహారంపై ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉండే సిట్‌తో కాకుండా సీబీఐ దర్యాప్తు జరపాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దంతులూరి వాసురాజు, డాక్టర్ మజ్జి శారద ప్రియాంక, కార్పొరేటర్ దౌలుపల్లి కొండబాబు, ఆనందపురం జెడ్పీటీసీ కోరాడ వెంకటరావు, భీమిలి వైస్ ఎంపీపీ బోని బంగారునాయుడు, రాష్ట్ర వైఎస్సార్ సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు దాట్ల పెదబాబు, పోతిన హనుమంతు, ముఖ్య నాయకులు బెందాళం పద్మావతి, చేకూరి రజనీ, పిళ్లా సుజాత పాల్గొన్నారు.