
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుకు పరామర్శ
ఆరిలోవ: అనారోగ్య కారణంగా హెల్త్ సిటీ మెడ్ సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సోమవారం సాయంత్రం పరామర్శించారు. ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనను పరామర్శించిన వారిలో పార్టీ భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, కార్పొరేటర్ అనిల్‌కుమార్ రాజు, మాజీ కార్పొరేటర్ రవిరాజు, గంగా మహేష్, శివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.