
సత్తాచాటిన జూనియర్ అథ్లెట్లు వెంకట్రామ్, శేషు
విశాఖ స్పోర్ట్స్ : 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అథ్లెట్లు వెంకట్రామ్, శేషు పతకాలు సాధించారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ మీట్‌లో ఎం. వెంకట్రామ్ అండర్–20 బాలుర 800, 1500 మీటర్ల పరుగుల్లో విజేతగా నిలిచి స్వర్ణాలు అందుకున్నాడు. విశాఖ అథ్లెట్ డి. శేషు అండర్–18 బాలుర విభాగపు 200 మీటర్ల పరుగును 22.09 సెకన్లలో పూర్తి చేసి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఆంధ్ర జట్టుకు కోచ్‌గా వైకుంఠరావు వ్యవహరించగా, పతకాలు సాధించిన వీరిద్దరినీ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు అభినందించారు.

సత్తాచాటిన జూనియర్ అథ్లెట్లు వెంకట్రామ్, శేషు