సఫారీల జైత్రయాత్ర | - | Sakshi
Sakshi News home page

సఫారీల జైత్రయాత్ర

Oct 14 2025 7:49 AM | Updated on Oct 14 2025 7:51 AM

విశాఖ స్పోర్ట్స్‌ : వైఎస్సార్‌ స్టేడియంలో సోమవారం జరిగిన ఐసీసీ వుమెన్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌, షర్మిన్‌ (50), షోర్నా (51) అర్ధ సెంచరీల సహాయంతో 6 వికెట్లకు 232 పరుగులు చేసింది. 233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా జట్టుకు మారిజన్నే కాప్‌ (56), క్లో ట్రైయాన్‌ (62) కీలక అర్ధ సెంచరీలతో రాణించడంతో మరో మూడు బంతులుండగానే విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా వరుసగా మూడు విజయాలు సాధించి, ఆరు పాయింట్లతో సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement