
డాక్టర్ ఎస్‌కేఈ అప్పారావుకి ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అ
మహారాణిపేట: విజయవాడలో ఈనెల 10 నుంచి 12 వరకు జరిగిన 20వ సౌత్ జోన్ ఈఎన్‌టీ కాన్ఫరెన్స్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈఎన్‌టీ సంఘానికి సేవలందించిన డాక్టర్ ఎస్‌కేవీ అప్పారావుకు విశాఖలో సీనియర్ ఈఎన్‌టీ సర్జన్, అంకోశ అధ్యక్షులుగా వ్యవహరించినందుకు గాను, 40 ఏళ్ల నుంచి అందించిన వారి సేవలను గుర్తించి ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత ఈఎన్‌టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ డి. ముఖర్జీ తదితరులు డాక్టర్ అప్పారావును సన్మానించారు.