
పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు
తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, మహిళా విభాగం నాయకులతో కలిసి ఎకై ్సజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయని, మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్, సీనియర్ నాయకుడు గొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్లు మొల్లి లక్ష్మి, పల్లా అప్పలకొండ, కోరుకొండ వెంకట స్వాతి దాసు, జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కల్తీ మద్యంతో రోడ్డున పడ్డ కుటుంబాలు
దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో కల్తీ మద్యంపై వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ఇప్పటికే ఎంతో మంది చనిపోయారని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాసుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మహిళల పసుపు కుంకుమలకు చెందిన విషయం కాబట్టి వారికి అండగా నిలబడేలా సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జగదాంబ జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ తహసీల్దార్‌కు పార్టీ నాయకులు జాన్‌వెస్లీ, సనపల రవీంద్రభరత్, కార్పొరేటర్లు తోట పద్మావతి, బిపిన్‌కుమార్ జైన్‌తో పాటు పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు.
75 వేల బెల్టు షాపులు తొలగించాలి
ఉత్తర నియోజకవర్గంలో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారితో పాటు పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి బిర్లా జంక్షన్ నుంచి మాధవదారలోని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అసిస్టెంట్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ చేపట్టాలని, రాష్ట్రంలోని 75 వేల బెల్టు షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ కె.సతీష్, జీవీఎంసీ ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సాడి పద్మారెడ్డి, కార్పొరేటర్లు, మహిళా నేతలు పాల్గొన్నారు.

పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు

పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు