
నకిలీ మద్యం విక్రయాలు అరికట్టాలి
గాజువాకలో సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో దిబ్బపాలెం పునరావాస కాలనీలోని గాజువాక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. తొలుత 71వ వార్డులోని సుందరయ్య కాలనీలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద పోస్టర్లను ప్రదర్శించారు. నకిలీ మద్యం విక్రయాలను అరికట్టాలని కోరుతూ ఎకై ్సజ్ సీఐకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్‌కుమార్, కార్పొరేటర్లు మహ్మద్ ఇమ్రాన్, ఉరుకూటి చందు, భూపతిరాజు సుజాత, వార్డు అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.