
కల్తీ దందా
కూటమి అండ
కల్తీ మద్యంపై కదం తొక్కిన వైఎస్సార్ సీపీ మహిళా విభాగం
కల్తీ మద్యం మరణాల పాపం బాబుదే..
పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో బాజీ జంక్షన్ నుంచి ఎన్‌ఏడీ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సీహెచ్.వి.రమేష్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మళ్ల మాట్లాడుతూ కల్తీ మద్యం మరణాల పాపం ముఖ్యమంత్రి చంద్రబాబుదే అని అన్నారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య, జిల్లా అంగన్‌వాడీ అధ్యక్షురాలు శ్రీదేవి వర్మ, పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పేడాడ జ్యోత్స్య, కార్పొరేటర్లు పి.వి.సురేష్, బల్లా లక్ష్మణరావు, గుండపు నాగేశ్వరరావు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.