
జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు వంద ఫిర్యాదులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 100 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఫిర్యాదుల్లో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సంబంధించి 13 వినతులు రాగా, జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా జోన్–5 నుంచి 21, జోన్–8 నుంచి 18, జోన్–3 నుంచి 14 వినతులు అందాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆధ్వర్యంలో నాయకులు అదనపు కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. పెదగంట్యాడ వద్ద అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేయాలని, తక్షణమే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి యుద్ధ ప్రాతిపదికన తీర్మానం పంపాలని వారు కోరారు. ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ఫైనాన్సర్ అడ్వైజర్ మల్లికాంబ, సీసీపీ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, డీడీహెచ్ దామోదరరావు, పర్యవేక్షక ఇంజినీర్లు కె.శ్రీనివాసరావు, సంపత్‌కుమార్, గోవిందరావు, శాంతిరాజు, ఏడుకొండలు, డీసీపీలు హరిదాసు, కె.వేంకటేశ్వరరావు, రామ్మోహన్, యూసీడీ పీఓ ప్రసన్నవాణి, డీపీవో శాంతికుమారి పాల్గొన్నారు.